రామాయపట్నం పోర్టు పనుల్లో టీడీపీ ఎమ్మెల్యే అరాచకం!
రామాయపట్నం పోర్టు పనుల్లో టీడీపీ ఎమ్మెల్యే అరాచకం!

TDP MLA intury Nageswarao

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ టీడీపీ నేతల బలప్రయోగ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల్లో తన వాటా కావాలంటూ కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.
‘కప్పం’ కట్టాల్సిందే!
పోర్టు నిర్మాణ పనులకు అవసరమైన కంకర, ఇసుక తరలింపు వ్యవహారంలో తన హస్తక్షేపం ఉండాలంటూ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రతి లారీ ట్రిప్పునకు ₹1000 చెల్లించాలని నిర్మాణ సంస్థలపై ఒత్తిడి తెస్తున్నారు. ఇందుకు కంపెనీలు అంగీకరించకపోవడంతో తప్పుడు కేసులు పెట్టించి, లారీలను అడ్డుకోవడం మొదలుపెట్టారు.
ఎమ్మెల్యే వ్యాపారం – అధికార దుర్వినియోగం
ఇంటూరి నాగేశ్వరరావు ఇద్దరు కానిస్టేబుళ్లను తన అనుచరులుగా మార్చుకుని, లారీల రాకపోకలు అడ్డుకుంటున్నారు. ఈ వ్యవహారం సీఎం కార్యాలయానికి చేరినా చంద్రబాబు పట్టించుకోలేదు, ఆయన అరాచకం మాత్రం ఆగడం లేదు.
పోర్టు అభివృద్ధిని అడ్డుకుంటున్న టీడీపీ
రామాయపట్నం పోర్టు రాష్ట్ర అభివృద్ధికి కీలకం. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇది త్వరగా పూర్తి కావాలని చూస్తున్న వేళ, టీడీపీ ఎమ్మెల్యేలు లబ్ధిపొందాలని యత్నించడం దురదృష్టకరం. ప్రజా సేవ కంటే దందాలను ఎంపిక చేసుకున్న టీడీపీ నేతలు, రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెడుతున్నారు.
రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు… ఇటువంటి అరాచకాలకు త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారు!
మరిన్ని విశ్లేషణ కొరకు JAGAN TV1 ఫాలో అవ్వండి
కామెంట్‌లు