లూలు మాల్ - విశాఖ భూమి లూటీపై బొత్స విరుచుకుపాటు!
విశాఖపట్టణంలో విలువైన ప్రభుత్వ భూమిని కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తూ, చంద్రబాబు & పవన్ కూటమి ప్రజాసంపదను కొల్లగొడుతోందని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీచ్ రోడ్డులో 13.43 ఎకరాల విలువైన భూమిని లూలు గ్రూప్‌కు 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు కాబోయే బినామీల డీలింగులు ఏంటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
₹1300 కోట్ల భూమి – కేవలం ₹6 కోట్లు లీజు?
ఇది ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టా? లేక చంద్రబాబు, పవన్ & వారి ప్రైవేట్ మిత్రుల బినామీ ఒప్పందమా? ₹1300 కోట్ల విలువైన భూమిని కేవలం ₹6 కోట్లు లీజుకు ఇవ్వడం అంటే ఇది బహిరంగంగా జరిగే దోపిడీ కాదా? ప్రజా ఆస్తులను తక్కువ ధరకు కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడంలో ఏమాత్రం న్యాయం ఉంది
కూటమి ప్రభుత్వం వైజాగ్‌ను అమ్మే కుట్ర – బొత్స తీవ్ర విమర్శలు
ఈ భూమిని హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, సినిమా హాల్స్ నిర్మించడానికి ఇవ్వడమేంటని ప్రశ్నించిన బొత్స, విశాఖలోని ప్రభుత్వ భూములను సొంత ఆస్తుల్లా అమ్ముకునే పచ్చ ప్రభుత్వం కుట్రలు సాగిస్తున్నదని విమర్శించారు. చంద్రబాబు గతంలో మదినగూడలో లూలు గ్రూప్‌కు భూమి ఇచ్చినప్పుడు చివరకు ప్రాజెక్ట్ రద్దు అయ్యింది. ఇప్పుడు మళ్లీ అదే డ్రామా ప్రారంభమైందని బొత్స ఘాటుగా వ్యాఖ్యానించారు.
ప్రజల ఆస్తిని కార్పొరేట్లకు బహూకరిస్తారా?
"ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహించాలనేది ఒక విషయం. కానీ ప్రజల భూమిని తక్కువ రేటుకు లీజుకు ఇచ్చి వారికి లాభాలు పండించేలా చేస్తారా?" అంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైజాగ్ ప్రజల భవిష్యత్తును తాకట్టుపెట్టే టీడీపీ-జనసేన దోపిడీ పాలనను సహించబోమని బొత్స స్పష్టం చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ భవిష్యత్ కోసం కూటమి ప్రభుత్వం పోరాటం
ఈ ఒప్పందం వెనుక ఉన్న అసలు కుంభకోణాన్ని పూర్తిగా బహిర్గతం చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పోరాడుతుందని బొత్స హెచ్చరించారు. ప్రజల ఆస్తులను కొట్టేయడానికి ఎవరూ పర్మనెంట్ లీజుదారులు కాదు!
ఈ అవినీతి ఒప్పందంపై రోడ్డెక్కి పోరాడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ స్పష్టం చేసింది.
చంద్రబాబు పాత ఫ్రెండ్షిప్ వల్లే లూలు లీజు?
చంద్రబాబు అండ్ కోకు లూలు గ్రూప్‌తో ఉన్న పాత సంబంధాల కారణంగానే ఈ భూమిని ప్రైవేట్ సంస్థకు అప్పగించారా? ఇది వ్యాపార లావాదేవీ మాత్రమేనా? లేక తెలుగుదేశం పార్టీకి వచ్చే కమీషన్ల వ్యవహారమా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్.
ప్రజల ప్రశ్నలు:
ఈ ఒప్పందం వెనుక చంద్రబాబు, పవన్ వ్యక్తిగత ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా?
ప్రభుత్వ భూమి అంత తక్కువ రేటుకు ప్రైవేట్ సంస్థకు ఎలా కేటాయించగలరు?
ఇదంతా బినామీల కోసం నడిపిన స్కామ్ కాకపోతే మరేమిటి?
నిజం బయటపడాల్సిందే!
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న భారీ స్థాయిలో భూ దోపిడీకి లూలు మాల్ ఒక లైవ్ ఎగ్జాంపుల్. విశాఖ ప్రజలు దీనిపై గట్టిగా స్పందించాలి.
వైజాగ్‌ను కార్పొరేట్లకు అమ్మేసే కుట్రను తిప్పికొట్టాలి!
ఇదే కదా నిజమైన ప్రజా ఉద్యమం!
జగన్ టీవీ 1 విశ్లేషణ నచ్చినట్లయితే షేర్ చేయండి
కామెంట్‌లు