ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదు? చంద్రబాబు అసలు భయమెంటో తెలుసుకోవాలి!

 గతంలో వైసీపీ ప్రభుత్వం హయంలో టీడీపీకి 22 సీట్లు వచ్చాయి, కానీ కొంతమంది సభ్యులు వైసీపీ వైపు వెళ్లడంతో టీడీపీ అసెంబ్లీలో బలహీనంగా మారింది. ఆ సమయంలో జగన్ గారు ప్రతిపక్షానికి సముచిత గౌరవం ఇవ్వాలి అనే దృష్టితో వ్యవహరించగా, ఇప్పుడు చంద్రబాబు గారు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వెనుక చాలా కారణాలు ఉండొచ్చు.

 
జగన్ గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడానికి కారణాలు:


1. అసెంబ్లీలో మెజారిటీ సంఖ్యా బలం

అధికార పార్టీకి 160కి పైగా సీట్లు రావడంతో, వైసీపీకి అధికార ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఉండేలా మేనేజ్మెంట్ చేస్తున్నారు.

కనీసం 10% సీట్లు (175లో 18 సీట్లు) ఉంటే అధికార ప్రతిపక్ష హోదా లభిస్తుంది, కానీ వైసిపికి 40% ఓటింగ్ ఉంది వైసీపీకి 11 సీట్లు మాత్రమే ఉన్నాయి  దీనిని అడ్డుపెట్టుకుని హోదా నిరాకరిస్తున్నారు.


2. జగన్ గారి హయాంలో అవినీతి నిరూపించలేకపోవడం:

ప్రతిపక్ష హోదా ఉంటే అధికార పార్టీని ప్రశ్నించే హక్కు మరింత బలపడుతుంది.

చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి జగన్ గారికి వేదిక దొరుకుతుంది.

జగన్ హయాంలో అవినీతి జరిగిందని నిరూపించే సామర్థ్యం టిడిపికి లేకపోవడంతో, వద్దు అనే విధానంలో ఉన్నారు.

3. రాజకీయ ప్రయోజనాలు:

అధికార ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్ గారు మరింత ప్రజల్లో చురుగ్గా నిలిచిపోతారని చంద్రబాబు భావిస్తున్నారు.

శాసనసభలో అధికార ప్రతిపక్ష హోదా దక్కితే జగన్ కి మరింత ప్రాధాన్యత పెరుగుతుంది, మీడియా కవరేజ్ పెరుగుతుంది.

ప్రతిపక్ష హోదా ఉంటే, జగన్ గారు అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టగలరు.

 

ప్రజలకు దీని ద్వారా అర్థమయ్యే విషయం:


చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు జగన్ హయాంలో అవినీతి జరిగిందని నిరూపించాల్సిన బాధ్యతలో ఉంది.

కానీ, ఇప్పటి వరకు అవినీతి నిరూపించే స్థాయిలో ఏదీ బయట పెట్టలేకపోయారు.

దాంతో, అసలు ప్రతిపక్ష హోదానే ఇవ్వకుండా జగన్ గారిని అసెంబ్లీలో మాటలేని నాయకుడిగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు.

జగన్ హయాంలో అవినీతి జరిగిందని నిరూపించడానికి అసలు ఆధారాలు లేకపోవడం స్పష్టంగా బయటపడింది.

2029లో జగన్ తిరిగి రాకూడదనే కొట్రలకు పాల్పడుతున్నాడు చంద్రబాబు

అధికార ప్రతిపక్ష హోదా ఉంటే, పార్టీకి మద్దతుగా నిలబడి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే అవకాశం ఉంటుంది.

చంద్రబాబు  జగన్ గారిని అసెంబ్లీలో అణగదొక్కి, మీడియా కవరేజ్ దక్కకుండా చూస్తున్నారు.

జగన్ గారికి ప్రతిపక్ష హోదా వస్తే, 2029లో ఆయన తిరిగి బలంగా ఎదిగే అవకాశం ఉంటుంది.


అధికారంలో ఉన్న వారు ఎలా నడుస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు.

ప్రజలు నిజమైన పరిపాలన ఎవరిది, కుట్రలు ఎవరు చేస్తున్నారో గమనించాల్సిన సమయం ఇది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

2024 EVM స్కాం – ప్రజాస్వామ్యంలో పెరిగిన అనుమానాలు!"

చంద్రబాబు చేసిన పెద్ద మోసాలు – ఓ విశ్లేషణ

జగన్ గారి పునరాగమనానికి మార్గం – 2029 కోసం మా కసి శ్రమ!