వైయస్ జగన్ హయాంలో రాష్ట్ర అప్పులు – అసెంబ్లీ సాక్షిగా నిజాలు పయ్యావుల కేశవ్

 వైయస్ జగన్ హయాంలో రాష్ట్ర అప్పులు – అసెంబ్లీ సాక్షిగా నిజాలు!

తాజాగా, రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇచ్చిన అధికారిక ప్రకటనలో కీలకమైన నిజాలు వెలుగు చూశాయి. గత ఐదేళ్లలో వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో మొత్తం రూ. 3,39,580 కోట్ల అప్పులు మాత్రమే చేశారని మంత్రి స్పష్టంగా తెలిపారు.

 

అయితే, ఎన్నికల ముందు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి వైయస్ జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ, రాష్ట్రం 10 లక్షల కోట్లు అప్పుల్లో కూరుకుపోయిందని, 14 లక్షల కోట్లు అప్పు చేశారంటూ అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను మోసగించే ప్రయత్నం చేసింది.

అసెంబ్లీలో టీడీపీ అబద్ధాలు బట్టబయలు

YSRCP ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు అధికారికంగా సమాధానమిస్తూ, పయ్యావుల కేశవ్ గారు తన పార్టీ దుష్ప్రచారాన్ని తానే ఖండించుకున్నారు. ఆయన తానే అసెంబ్లీ సాక్షిగా చెప్పిన 3.39 లక్షల కోట్ల నిజమైన అప్పుల గణాంకాలు టీడీపీ అసత్య ప్రచారాన్ని ఛేదించాయి.

అసత్య ప్రచారంతో ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం

 


 

 

 

 

 

 

 

 

 

 

 

వాస్తవాలను పక్కన పెట్టి, తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ-జనసేన కూటమి ఎన్ని ప్రయత్నాలు చేసినా, అసెంబ్లీలో నిజాలు బట్టబయలయ్యాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా అవాస్తవ ప్రచారాలే చేస్తుంది.

ప్రజలు నిజాలు తెలుసుకోవాలి

ఈ అసత్య ప్రచారాన్ని ప్రజలు గుర్తించాలి. అసెంబ్లీలో అధికారికంగా వెల్లడైన లెక్కలు స్పష్టంగా చెబుతున్నాయి – జగన్ హయాంలో రూ. 3,39,580 కోట్ల అప్పులు మాత్రమే చేసిన ప్రభుత్వం, అసత్య ప్రచారం చేసే ప్రతిపక్షాన్ని ప్రజలు నమ్మరాదు!


మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సత్యాన్ని తెలుసుకోండి, ఇతరులతో పంచుకోండి!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

2024 EVM స్కాం – ప్రజాస్వామ్యంలో పెరిగిన అనుమానాలు!"

చంద్రబాబు చేసిన పెద్ద మోసాలు – ఓ విశ్లేషణ

జగన్ గారి పునరాగమనానికి మార్గం – 2029 కోసం మా కసి శ్రమ!