లులు మాల్, TCS భూముల కుంభకోణం – అభివృద్ధి ముసుగులో కూటమి ప్రభుత్వం అవినీతి?

అభివృద్ధి ముసుగులో అవినీతి? విశాఖపట్నంలో లులు మాల్, TCS భూముల కధ చెప్పాలి!


 

TCS భూముల అవినీతి వీడియో 🔗 ఇక్కడ ఉంది

Lulu మాల్  అవినీతి వీడియో 🔗 ఇక్కడ ఉంది

 ప్రజల భూమి ఇప్పుడు కార్పొరేట్ సంస్థలకు కోట్ల విలువైన భూములను తక్కువ ధరకే లీజ్‌కి ఇస్తున్నారూ? ఇది అభివృద్ధి ముసుగులో జరిగే అవినీతి కాదా..


లులు మాల్ కు విశాఖ బీచ్ రోడ్‌లో 13.5 ఎకరాలు - కేవలం 6 కోట్లు మాత్రమే!

విశాఖపట్నం బీచ్ రోడ్... ఆ నగరంలో విలువైన ప్రాంతాల్లో ఒకటి. అక్కడ 13.5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేవలం 6 కోట్ల రూపాయలకే 90 సంవత్సరాల లీజుకి ఇచ్చారు.
సాధారణంగా అక్కడ ఒక ఎకరం ధర రూ. 70-80 కోట్లు ఉండగా, మొత్తం భూమిని 6 కోట్లకే అప్పగించడమేంటి?
 

అంటే సంవత్సరానికి రూ. 6.6 లక్షలకే 13.5 ఎకరాలు లీజు!
ఇది ఒక చిన్న షాపు అద్దె కన్నా తక్కువ కాదా?



TCS కి 21 ఎకరాలు - భూమి రేటు కేవలం 99 పైసలు!

ఇక హైదరాబాద్, బెంగళూరు లాంటి సాఫ్ట్‌వేర్ హబ్‌లను పోటీ పడి తలపడాలి అనుకునే విశాఖకు TCS వంటి దిగ్గజ కంపెనీకి భూమి ధర మాత్రం కేవలం 99 పైసలు అనగానే ప్రజల్లో అనుమానాలు మొదలవుతున్నాయి.

ఇది అభివృద్ధి కాదు – ఇది వ్యాపారావకాశాల పేరుతో ఆస్తుల బహిరంగ దోపిడీ!

ప్రభుత్వ భూములు అంటే మామూలు ప్రాపర్టీ కాదు, ఇది ప్రజల సంపద. అందులో: కార్పొరేట్ సంస్థలకే ప్రత్యేక రాయితీలు ఇవ్వాలి కానీ మీరు భూములు దారదత్తం చేస్తున్నారు
 

యువతి యువకులకు ఉద్యోగాలు లేవని చెప్పే ప్రభుత్వం, లక్షల్లో ఆదాయాన్ని కోల్పోయే ఈ డీల్స్ ఎందుకు చేస్తోంది?


ప్రజలు అడగాల్సిన ప్రశ్నలు:

1. ఈ భూముల విలువను సరైన మార్కెట్ రేటు ప్రకారం అంచనా వేశారా?


2. ఇందులో రాష్ట్రానికి ప్రయోజనం ఎంత? లాభం కలిగేలా ఏ విధమైన షరతులు పెట్టారు?


3. ఇలాంటి డీల్స్ వల్ల సాధారణ ప్రజానికానికి లాభం ఏమైనా ఉంటుందా?
 

అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ప్రజలకు ఆన్యాయం జరుగుతుంటే– ప్రశ్నించడం అవసరం!

ప్రజల భూమిని అమ్ముకుని పద్ధతి లేకుండా గుత్తేదార్లకు ఇచ్చినట్లయితే, అది అభివృద్ధి కాదు – అది అవినీతి!
ఇలాంటి వ్యవహారాలను ప్రశ్నించాలి, శాంతియుతంగా, చట్టబద్ధంగా – తద్వారా మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తును రక్షించాలి.

జగన్ టీవీ 1 విశ్లేషణ నచ్చినట్లయితే. మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో చెప్పండి – ఇది అభివృద్ధి అనిపించిందా? లేక కచ్చితంగా అవినీతి అనిపించిందా?



కామెంట్‌లు

Hi చెప్పారు…
Good sir

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

2024 EVM స్కాం – ప్రజాస్వామ్యంలో పెరిగిన అనుమానాలు!"

చంద్రబాబు చేసిన పెద్ద మోసాలు – ఓ విశ్లేషణ

జగన్ గారి పునరాగమనానికి మార్గం – 2029 కోసం మా కసి శ్రమ!