లూలు మాల్ - విశాఖ భూమి లూటీపై బొత్స విరుచుకుపాటు!

విశాఖపట్టణంలో విలువైన ప్రభుత్వ భూమిని కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తూ, చంద్రబాబు & పవన్ కూటమి ప్రజాసంపదను కొల్లగొడుతోందని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీచ్ రోడ్డులో 13.43 ఎకరాల విలువైన భూమిని లూలు గ్రూప్‌కు 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు కాబోయే బినామీల డీలింగులు ఏంటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ₹1300 కోట్ల భూమి – కేవలం ₹6 కోట్లు లీజు? ఇది ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టా? లేక చంద్రబాబు, పవన్ & వారి ప్రైవేట్ మిత్రుల బినామీ ఒప్పందమా? ₹1300 కోట్ల విలువైన భూమిని కేవలం ₹6 కోట్లు లీజుకు ఇవ్వడం అంటే ఇది బహిరంగంగా జరిగే దోపిడీ కాదా? ప్రజా ఆస్తులను తక్కువ ధరకు కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడంలో ఏమాత్రం న్యాయం ఉంది కూటమి ప్రభుత్వం వైజాగ్‌ను అమ్మే కుట్ర – బొత్స తీవ్ర విమర్శలు ఈ భూమిని హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, సినిమా హాల్స్ నిర్మించడానికి ఇవ్వడమేంటని ప్రశ్నించిన బొత్స, విశాఖలోని ప్రభుత్వ భూములను సొంత ఆస్తుల్లా అమ్ముకునే పచ్చ ప్రభుత్వం కుట్రలు సాగిస్తున్నదని విమర్శించారు. చంద్రబాబు గతంలో మదినగూడలో లూలు గ్రూ...