P4 లో దత్తత తీసుకోవడం అంటే ఏమిటి? సహాయం లేక దాస్య విధానం?
P4 వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం మీద ప్రజలకే అనుమానాలు కలుగుతుంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ప్రకటించిన "P4" స్కీం అర్థం కాని పరిస్థితి ప్రజలకు.

అయితే ఈ "P4"లో చెప్పిన "దత్తత తీసుకోవడం" అనే భావన ప్రజలలో కలకలం రేపుతోంది. ఇది నిజంగా పేదల పట్ల మానవతా సహాయం కోణమా? లేక డబ్బున్నవారి చేతుల్లో పేదలను వాణిజ్య ఉత్పత్తులా మార్చే దాస్య విధానమా?
P4 అంటే ఏమిటి?
చంద్రబాబు నాయుడు గారి ప్రకటన ప్రకారం,
P4 = People + Public + Private + Partnership
అంటే ప్రజలు, ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం కలిసి భాగస్వామ్యంతో పని చేయాలి. ఇది పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ మాదిరిగా ఉండవచ్చని చెబుతున్నారు. అయితే ఈసారి ప్రయోజనం కేవలం ఆర్థిక అభివృద్ధి కాదు – పేద కుటుంబాల మార్పు కనిపిస్తాదా లేక పేదలను దిగజార్చే మార్పా...
బంగారు కుటుంబాలుకు పథకం: ఏమి చెబుతున్నారు?
ఈ పథకంలో ముఖ్యంగా డబ్బున్నవారు, కార్పొరేట్ సంస్థలు, NRIలు వంటి వారు ఒకో పేద కుటుంబాన్ని దత్తత. తీసుకోవాలి అని చెప్పారు. దీని ప్రకారం వారు: 1:ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలి 2: ఆరోగ్యం, విద్యలో సహాయపడాలి 3: జీవనోపాధి కల్పించాలి 4: పిల్లలకు ఉద్యోగ అవకాశం లేదా ట్రైనింగ్ ఇవ్వాలి. ఇంతవరకూ వినిపించేదీ మంచి మాటలే...
కానీ ప్రశ్నలు చాలా ఉన్నాయి!
1. దత్తత అంటే హక్కులేమైనా వస్తాయా? ఇది చట్టబద్ధమైన దత్తత కాకపోయినా, వాస్తవికంగా ఒక డబ్బున్నవాడు ఒక పేద కుటుంబంపై సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధిస్తే అది ప్రమాదకరంగా మారవచ్చు.
2. పర్యవేక్షణ లేకుంటే దుర్వినియోగం ఎలా? ఈ పథకం కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా జరగితే. వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్న ప్రమాదం ఉంది . శ్రమదోపిడీ, బాల కార్మిక వ్యవస్థకు మార్గం సిద్ధం అవుతుంది పేద కుటుంబాలపై అనైతిక ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది
3. ఇది సహాయమా లేక దాస్య విధానమా? సహాయం అనే పేరు పెట్టుకుని, దయతో కాకుండా బాధ్యత లేకుండా వ్యవహరిస్తే అది నూతన దాస్య విధానం అవుతుంది.
చట్టపరంగా చూస్తే? భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించింది. పేదరికం నుండి విముక్తి ప్రభుత్వ బాధ్యత. దాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో అప్పగించడమంటే:
1: ప్రభుత్వ వైఫల్యం 2: ప్రజల హక్కుల వదలిక 3: ప్రైవేట్ ఆధిపత్యం పెంపు
ప్రజల భద్రతపై స్పష్టత అవసరం. పేదలపై ప్రేమ ఉంటే, ప్రభుత్వం నేరుగా: ఉచిత విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరచాలి, ఉపాధి అవకాశాలు పెంచాలి
ఇలా కాకుండా, “పేదలను దత్తత తీసుకోండి” అని చెప్పడం – ప్రభుత్వ బాధ్యతను తప్పించుకునే చర్య అనిపించకమానదు.
ముగింపు: P4" అనే ప్రకటనకి ఉన్న మాటలు ఆకర్షణీయంగా ఉండవచ్చు. కానీ దత్తత అనే భావనను సరైన పర్యవేక్షణ లేకుండా ప్రజలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో అప్పగిస్తే – అది పేద ప్రజల భవిష్యత్తును మరింత అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉంది. దీని మీద స్పష్టత, చట్టపరమైన గైడ్‌లైన్స్ లేకపోతే —
బంగారు కుటుంబాలు" కాదు… బానిస కుటుంబాలయే కావచ్చు!
JAGAN TV1 విశ్లేషణ నచ్చినట్లయితే షేర్ చేయండి
మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో చెప్పండి: మీరు ఈ “దత్తత” స్కీంను ఎలా చూస్తున్నారు? ఇది ప్రజల జీవితాల్లో వెలుగు తెస్తుందా? లేక మరింత చీకటి నింపుతుందా?
కామెంట్‌లు