పోస్ట్‌లు

మే, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

అసలు లిక్కర్ స్కాం ఎవరిది? జగన్ చెప్పిన నంబర్లతో బాబు షాక్

చిత్రం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లిక్కర్ వ్యవహారంపై  ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు బండారం బయట పెట్టారు, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. జగన్ హయాంలో లిక్కర్ అమ్మకాలు తగ్గినా ఆదాయం ఎలా పెరిగింది? అంటే ఏదో మాయాజాలం కాదు, పూర్తి ఆంకెలతో జగనే సమాధానం చెప్పారు.             లిక్కర్ అమ్మకాల లెక్కలు చెపుతున్నాయి – లిక్కర్ స్కాం ఎవరు వైపు ఉందో బాబు పాలనలో (2014–19) :                                  మొదటి ఏడాది (2014–15): 4.62 కోట్ల కేసులు అమ్మారు చివరి ఏడాది (2018–19): 6.61 కోట్ల కేసులు అమ్మారు అంటే పెరిగిన అమ్మకాలు: 2 కోట్ల కేసులు జగన్ పాలనలో (2023–24):                                    లిక్కర్ అమ్మకాలు: 4.44 కోట్ల కేసులు అమ్మారు, అంట...

కూటమి కుట్రలు – ప్రజలను మోసగించడానికే ఈ డ్రామా!

చిత్రం
ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్‌మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక మార్గంలో అరెస్టు చేయాలని కుట్రలు పన్నుతోంది. ఇది హఠాత్ గా కాదు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో, ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న ఓ రాజకీయ డ్రామా. జగన్ పేరు గుర్తుకొస్తే చంద్రబాబుకు భయం గుబులు               ఒకసారి గుర్తించండి – 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జగన్ గారిని అరెస్టు చేసి 16 నెలలు జైల్లో ఉంచింది. దాంతో ఏమైంది? ప్రజలు దాన్ని తిప్పి కొట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిగా తరిమి కొట్టారు. ఇప్పుడు అదే పని చంద్రబాబు చేస్తే, 2029లొ కూటమి పార్టీలన్నీ కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఈ రోజు ప్రజలు దారుణంగా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో రైతు ఏడుస్తున్నాడు, విద్యార్థి భవిష్యత్తు కోసం బాధపడుతున్నాడు, తల్లి బిడ్డకు ఆహారం పెట్టలేక కన్నీరు కారుస్తోంది. ఈ పరిస్థితుల్లో పాలన చేయలేని చంద్రబాబు ఏం చేస్తున్నాడు? “రెడ్ బుక్”లో రాజకీయ వేధింపులకు పాఠాలు చదువుతున్నాడు!  విద్యకు గతి లేదు, వైద్యం భారంగా మారింది. అసలు ప్రజల పాలన మీద దృష్టి పెట్టాలి కదా? కానీ చంద్రబా...

కూటమి మాయ మాటలు – ప్రజల ఆశలను బలిగొన్న ప్రభుత్వం

చిత్రం
ప్రతి ఎన్నికల ముందు రాజకీయం ఒక డ్రామాగా మారిపోయింది. నటించేవారు మారినా, స్క్రిప్ట్ మాత్రం అదే – మాయ మాటలు, బోగస్ హామీలు, భయపెట్టే ఫేక్ ప్రాపగండా! ఇప్పటి కూటమి ప్రభుత్వం కూడా అలాగే వచ్చింది. ఒకింత ఆశగా, ఇంకొంత నిరీక్షణగా ప్రజలు ఓటు వేశారు. కానీ ఇప్పుడు?             సూపర్ 6 – పేరు మాత్రమే సూపర్! అట్టర్ ప్లాప్ పదవి చేపట్టగానే పెద్దగా ప్రచారం చేసిన "సూపర్ 6" హామీలు ఇప్పుడు ప్రజలకు తలపట్టించే రీతిలో మారాయి. ఒక్క హామీ అయినా నెరవేరిందా? విద్య, వైద్యం, రైతులకు మద్దతు, మహిళలకు భద్రత – ఏ అంశంలోనూ పాజిటివ్ మార్పు కనిపించలేదు. కరెంట్ బిల్లు షాక్ – లైటు వేయకుండానే బిల్లు చూస్తే షాక్ కొడుతుంది  ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనంత రేట్లతో కరెంట్ బిల్లులు వస్తున్నాయి. ఒక మధ్యతరగతి కుటుంబం నెలకు వందలు కాదు, వేల రూపాయలు కరెంట్ బిల్లుకే కడుతుంది. దీని ప్రభావం చిన్న వ్యాపారాలపైనా, రైతులపైనా, సాధారణ జీవనంపైనా భయంకరంగా ఉంది. వ్యవసాయ ధరలు? – రైతు జీవితం చీకటి– మద్దతు ధరలు అట్టడుగు. వ్యవసాయ ధరలు పాతాళానికి వెళ్లిపోయాయి. మద్దతు ధర లేదు, సబ్సిడీ లేదు. గింజలకన్నా ఖర్చులే ఎక్కువ. అనుకు...

ప్రకృతిని ధ్వంసం చేస్తున్న కూటమి . విశాఖలో 98 ఎకరాల పచ్చదనం ముక్కలయ్యింది!"

చిత్రం
 విశాఖపట్టణం – ఋషికొండ పచ్చని కొండలు, సముద్రపు గాలులతో జీవం పుంజుకున్న నగరం. కానీ ఇప్పుడు మానవ స్వార్థానికి బలైన ప్రకృతి. రుషికొండ ఐటీ సెజ్ పక్కనే 98 ఎకరాల్లో ఉన్న పచ్చని కొండలను సమూలంగా ధ్వంసం చేస్తున్న చిత్రాలు చూశాక మనసు కలవరం చెందకమానదు.     రుషికొండ ఐటీ సెజ్ పక్కనే విలాసవంతమైన విల్లాలు & అపార్టుమెంట్లు కట్టడానికే, 98 ఎకరాల పచ్చని కొండలు నేలమట్టం చేస్తుండటం సజీవ సాక్ష్యం. ఈ విధ్వంసం వెనుక ఒక మంత్రి,  ఒక ఎమ్మెల్యే అనుమతి ఉన్నట్లు సమాచారం. ఇక అసలు ప్రశ్న – పర్యావరణాన్ని రక్షించాలని గగ్గోలు పెట్టిన వాళ్ళు ఎక్కడ? జగన్ హయంలో 9 ఎకరాల్లో టూరిజం బిల్డింగ్ కడితే పకృతి విధ్వంసం అని అరచిన వాళ్లు, ఇప్పుడు 98 ఎకరాల్లో ప్రకృతి నాశనం జరుగుతుంటే – మౌనం ఎందుకు? ఈ విధ్వంసానికి ఆమోదం తెలిపింది ఎవరు? ప్రజల భరోసాగా పాలన సాగించాల్సిన నేతలు, ప్రైవేట్ లాభాలకోసం ప్రకృతి వెన్నుతోడుగా దోపిడీ చేస్తున్నారా? ఇది కేవలం రాజకీయ విమర్శ కాదు. ఇది మన భవిష్యత్తుపై ప్రశ్న. ప్రకృతి మన చేతిలో Amanat (ఆస్తి), ఇప్పుడు 98 ఎకరాల్లో పచ్చదనం నాశనం చేస్తుంటే పకృతి ప్రేమికులు పారిపోయారా? లేక అమ్ముడుపోయారా...

సింహాచలం విషాదం: పవన్ కళ్యాణ్ ఇప్పుడైనా ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి!

చిత్రం
సింహాచలం దేవస్థానంలో గోడ కూలిన ఘోర ఘటనలో ఎనిమిది మంది భక్తులు బలయ్యారు. ఇది కేవలం ఒక ప్రమాదం కాదు – ఇది ప్రభుత్వానికి, ముఖ్యంగా దేవస్థానాల భద్రతను నిర్లక్ష్యం చేసిన అధికారులకు ప్రభుత్వానికి హెచ్చరిక.   అయితే, గతంలో చిన్న చిన్న అంశాలకే దీక్షలు చేసిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎందుకు మౌనంగా ఉన్నారు? తిరుపతిలో లడ్డూ కల్తీ అయ్యిందని ప్రాయశ్చిత్త దీక్ష చేసిన నేత, ఇప్పుడు ఎనిమిది మంది ప్రాణాలు పోయినప్పటికీ ఒక్క క్షణం తలవంచలేదంటే ప్రజల ప్రాణాల పట్ల ఆయనకు గౌరవం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్‌కు పశ్చాత్తాపం ఉంటే, సింహాచలం మెట్లని  కడిగి, నిజమైన భక్తుడిలా ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. ఇది సినిమా డైలాగ్‌లు చెప్పే సందర్భం కాదు, నిజమైన బాధితుల కోసం గళం వినిపించాల్సిన సమయం. ప్రజల ప్రశ్న: ఒక దేవస్థానంలో భక్తుల ప్రాణాలు పోయినప్పుడు మౌనంగా ఉండే నేత పవన్ కళ్యాణ్ "భక్తి" గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు? Jagan Tv1 విశ్లేషణ నచ్చినట్లయితే షేర్ చేయండి   Pawan Kalyan Deeksha, Simhachalam Tragedy, Simhachalam Accident, Pawan Kalyan Reaction, Andhra Politics News, YSRCP vs JanaSena,...