కూటమి మాయ మాటలు – ప్రజల ఆశలను బలిగొన్న ప్రభుత్వం
ప్రతి ఎన్నికల ముందు రాజకీయం ఒక డ్రామాగా మారిపోయింది. నటించేవారు మారినా, స్క్రిప్ట్ మాత్రం అదే – మాయ మాటలు, బోగస్ హామీలు, భయపెట్టే ఫేక్ ప్రాపగండా! ఇప్పటి కూటమి ప్రభుత్వం కూడా అలాగే వచ్చింది.
ఒకింత ఆశగా, ఇంకొంత నిరీక్షణగా ప్రజలు ఓటు వేశారు. కానీ ఇప్పుడు?
సూపర్ 6 – పేరు మాత్రమే సూపర్! అట్టర్ ప్లాప్
పదవి చేపట్టగానే పెద్దగా ప్రచారం చేసిన "సూపర్ 6" హామీలు ఇప్పుడు ప్రజలకు తలపట్టించే రీతిలో మారాయి. ఒక్క హామీ అయినా నెరవేరిందా? విద్య, వైద్యం, రైతులకు మద్దతు, మహిళలకు భద్రత – ఏ అంశంలోనూ పాజిటివ్ మార్పు కనిపించలేదు.
కరెంట్ బిల్లు షాక్ – లైటు వేయకుండానే బిల్లు చూస్తే షాక్ కొడుతుందిఇప్పటి వరకు ఎప్పుడూ చూడనంత రేట్లతో కరెంట్ బిల్లులు వస్తున్నాయి. ఒక మధ్యతరగతి కుటుంబం నెలకు వందలు కాదు, వేల రూపాయలు కరెంట్ బిల్లుకే కడుతుంది. దీని ప్రభావం చిన్న వ్యాపారాలపైనా, రైతులపైనా, సాధారణ జీవనంపైనా భయంకరంగా ఉంది.
వ్యవసాయ ధరలు? – రైతు జీవితం చీకటి– మద్దతు ధరలు అట్టడుగు.వ్యవసాయ ధరలు పాతాళానికి వెళ్లిపోయాయి. మద్దతు ధర లేదు, సబ్సిడీ లేదు. గింజలకన్నా ఖర్చులే ఎక్కువ. అనుకున్నా అనుకోకుండానే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం మాత్రం రైతుల అభివృద్ధి మాటలకే పరిమితం.
వర్షాలు అటకెక్కితే... పాలన ఊరకే కూచుంది!నీటి ప్రాజెక్టులు ముందుకు వెళ్లక, పట్టణాల్లో తాగునీటి కొరత పెరుగుతుంది. పల్లెప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి. అయినా కూడా పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తి కాకుండా తలతిప్పి కూర్చున్నారు.
అమరావతి – మాటలలో రాజధాని, వాస్తవంలో శ్మశానం!రైతులు ఇచ్చిన భూములు ప్రయోజనం లేకుండా పోయాయి. ఇది మరొక రాజధాని కాదుగాని, ప్రజల నమ్మకాన్ని బలిగొన్న వేదనామయం.
ఉద్యోగాల హామీ – ఊసే లేదు, నోటిఫికేషన్లు కనబడడం లేదు!ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినవారు... ఇప్పుడు నాలుగు వేల పోస్టులు కూడా విడుదల చేయలేని పరిస్థితి. యువత నిరుద్యోగ భయంతో దేశం వదిలిపెట్టే పరిస్థితి.
TTD – భక్తి మారింది, రాజకీయ కలుషితంగా!ఆంధ్ర ప్రజల గర్వంగా ఉండే తిరుమల తిరుపతి దేవస్థానం – ఇప్పుడు రాజకీయ జోక్యంతో ప్రతిష్ట దిగజారుతోంది. భక్తుల మనసుల్లో అయోమయం పెరుగుతోంది.
రెడ్ బుక్ పాలన – విమర్శించాను అంటే కక్ష తీర్చడం!ప్రజల ప్రశ్నిస్తే, వాళ్లపై కేసులు బుక్కుచేస్తున్నారు. సోషల్ మీడియాలో నిరసన తెలిపినవారిపై కక్షతో వ్యవహరిస్తున్నారు. ఈ పద్ధతికి పేరు... రెడ్ బుక్ పాలన!
ఇక ముందు?ఇన్ని వాస్తవాలు చూసిన తరువాత కూడా మనం మౌనంగా ఉండాలి అంటే అది మన బాధ్యతల నుంచి పారిపోవడం. ప్రజల బతుకులను నాశనం చేసే మాయ మాటల కూటమిని తిరస్కరించాలంటే ఇప్పుడు మనం మాట అనేది ఆయుధంగా మలచుకోవాలి.
"నెరవేరని హామీలను ప్రశ్నిద్దాం
మాటల కంటే పనులకు ఓటెయ్యాలి!"
JAGAN Tv1 విశ్లేషణ నచ్చినట్లయితే షేర్ చేయండి మీ జగదీష్
kutami fake promises, ap government failure, pawan kalyan questioned, chandrababu criticized, farmers struggle, women protest in ap, 2024 ap elections, amaravati injustice, polavaram halt, power bill hike andhra
కామెంట్‌లు