కూటమి కుట్రలు – ప్రజలను మోసగించడానికే ఈ డ్రామా!

ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్‌మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక మార్గంలో అరెస్టు చేయాలని కుట్రలు పన్నుతోంది. ఇది హఠాత్ గా కాదు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో, ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న ఓ రాజకీయ డ్రామా. జగన్ పేరు గుర్తుకొస్తే చంద్రబాబుకు భయం గుబులు 

 


 

 

 

 

 

ఒకసారి గుర్తించండి – 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జగన్ గారిని అరెస్టు చేసి 16 నెలలు జైల్లో ఉంచింది. దాంతో ఏమైంది? ప్రజలు దాన్ని తిప్పి కొట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిగా తరిమి కొట్టారు. ఇప్పుడు అదే పని చంద్రబాబు చేస్తే, 2029లొ కూటమి పార్టీలన్నీ కనుమరుగయ్యే అవకాశం ఉంది.

ఈ రోజు ప్రజలు దారుణంగా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో రైతు ఏడుస్తున్నాడు, విద్యార్థి భవిష్యత్తు కోసం బాధపడుతున్నాడు, తల్లి బిడ్డకు ఆహారం పెట్టలేక కన్నీరు కారుస్తోంది. ఈ పరిస్థితుల్లో పాలన చేయలేని చంద్రబాబు ఏం చేస్తున్నాడు? “రెడ్ బుక్”లో రాజకీయ వేధింపులకు పాఠాలు చదువుతున్నాడు!  విద్యకు గతి లేదు, వైద్యం భారంగా మారింది. అసలు ప్రజల పాలన మీద దృష్టి పెట్టాలి కదా? కానీ చంద్రబాబు గారికి దానితో పని లేదు. ఆయనకు ‘రెడ్ బుక్’ మాత్రమే గుర్తుంది – ప్రజల సమస్యలు కాదు!

జగన్‌మోహన్ రెడ్డి గారు తిరిగి వస్తారు. ప్రజల తీర్పు నిశ్చితంగా ఉంటది.

మీకు చెప్పేదేమంటే – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరూ ధైర్యంగా నిలబడాలి. మన ప్రభుత్వం మళ్లీ రానుంది. ఇది తాత్కాలిక తుఫానే కానీ, తర్వాతి ప్రభుత్వం మనదే. మన నమ్మకం, మన ఐక్యతే మన బలంగా నిలవాలి.

వార్నింగ్!
జగన్‌మోహన్ రెడ్డిని తాకాలని చూస్తే, ప్రజల చేతులే మీకు ఉరి కట్టగలవు. ప్రజల గుండెల్లో నిండి ఉన్న దేవుడిని అరెస్ట్ చేస్తే, రాష్ట్రమే రగిలిపోతుంది. చరిత్ర చూస్తూ ఉంది. ఈ రోజు మీరు ఎన్ని కుట్రలు చేసినా – రేపటి రోజు జగన్ గారి జయహో మాత్రమే వినిపిస్తుంది!


జగన్ టీవీ1 తరపున – మీ జగదీష్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చంద్రబాబు చేసిన పెద్ద మోసాలు – ఓ విశ్లేషణ

జగన్ గారి పునరాగమనానికి మార్గం – 2029 కోసం మా కసి శ్రమ!

25 వేల కోట్ల మద్యం మాఫియా మూల విరాట్టు చంద్రబాబే!