పార్లమెంట్లో జగన్ పై దాడికి సిద్ధం కండి!
రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రావాలి, ప్రత్యేక హోదా సాధించాలి, పోలవరం పూర్తవ్వాలి… ఇవన్నీ మన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు. కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఇవేమీ ముఖ్యం కావు!

ఇప్పుడు చంద్రబాబు కొత్త గేమ్ ప్లాన్ రెడీ చేశారు పార్లమెంటులో జగన్ మోహన్ రెడ్డి మీద తప్పుడు ప్రచారం చేయండి! కూటమి ఎంపీ లు అందరికీ హుకుం జారీ చేశారు. అంతే గాని రాష్ట్రం అవసరాల కోసం డెవలప్మెంట్ గురించి పార్లమెంట్లో మాట్లాడవద్దని స్పష్టమైన ఆదేశం ఎంపీలకు ఇచ్చారు.
ఇది ఎలాంటి? నాయకత్వమా? లేక భయమా?
ఒక్క వ్యక్తిని టార్గెట్ చేయడం కోసం
👉 కేంద్రంతో పోరాడాల్సిన వేదికను
👉 రాష్ట్ర ప్రజల గొంతు వినిపించాల్సిన సభను
👉 అసలు అభివృద్ధి అంశాల్ని పక్కన పెట్టి...
జగన్ గారిపై రాజకీయ కక్ష సాధింపుకు వేదికగా మార్చాలనుకోవడం ఎంత నీచమైన ఆలోచన?
ఏం బాబూ, జగన్ మోహన్ రెడ్డి పేరు వింటే చాలు భయమేస్తుందా? అందుకే దిల్లీలోనైనా సరే వేదిక ఎక్కడైనా కావచ్చు గాని... జగన్ మీద మాటలు వదలడం తప్ప నీకు వేరేం పనులేవా? చంద్రబాబు గారు, మీరు ఎప్పుడూ వ్యక్తిగత కక్షలతోనే నడుస్తారు.
రాష్ట్ర ప్రయోజనాలు మీకు ఎప్పుడూ రెండో ప్రాధాన్యత.
పోలవరాన్ని కేంద్రం పట్టించుకోవాలంటే మీ ఎంపీలు ఎందుకు గళం ఎత్తడం లేదు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎందుకు మౌనం? ఎందుకంటే... మీ దృష్టి మొత్తం జగన్ మీదే. ఇది కూటమి కాదు – ఇది "జగన్ వ్యతిరేక గ్యాంగ్"
ప్రజలకు ఇప్పుడు బాగా అర్థమవుతోంది...
👉 రాష్ట్రాన్ని మర్చిపోయి,
👉 ప్రజలను మోసం చేసి,
👉 ఒక్క జగన్ గారినే టార్గెట్ చేస్తూ,
👉 కూటమి ప్రభుత్వం **"జగన్ ఫోబియా"**తో బతుకుతోంది!
ప్రజలకు సందేశం:
ఒక్క జగన్ గారి పేరుతోనే ఢిల్లీ మద్దతు కోల్పోతున్నారు అంటే, ఆయన బలమేంటి అనేది ఈ గడగడలతో తెలుస్తోంది!
జగన్ గారు బలంగా ఉన్నారు. ప్రజల మద్దతు ఆయన వెంట ఉంది. ఢిల్లీ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు – ఎక్కడైనా నిలబెడతారు. ఎందుకంటే ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఉంది!
JAGAN Tv1 team విశ్లేషణ నచ్చినట్లయితే షేర్ చేయండి
కామెంట్‌లు