P4 లో దత్తత తీసుకోవడం అంటే ఏమిటి? సహాయం లేక దాస్య విధానం?

P4 వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం మీద ప్రజలకే అనుమానాలు కలుగుతుంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ప్రకటించిన "P4" స్కీం అర్థం కాని పరిస్థితి ప్రజలకు. అయితే ఈ "P4"లో చెప్పిన "దత్తత తీసుకోవడం" అనే భావన ప్రజలలో కలకలం రేపుతోంది. ఇది నిజంగా పేదల పట్ల మానవతా సహాయం కోణమా? లేక డబ్బున్నవారి చేతుల్లో పేదలను వాణిజ్య ఉత్పత్తులా మార్చే దాస్య విధానమా? P4 అంటే ఏమిటి? చంద్రబాబు నాయుడు గారి ప్రకటన ప్రకారం, P4 = People + Public + Private + Partnership అంటే ప్రజలు, ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం కలిసి భాగస్వామ్యంతో పని చేయాలి. ఇది పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ మాదిరిగా ఉండవచ్చని చెబుతున్నారు. అయితే ఈసారి ప్రయోజనం కేవలం ఆర్థిక అభివృద్ధి కాదు – పేద కుటుంబాల మార్పు కనిపిస్తాదా లేక పేదలను దిగజార్చే మార్పా... బంగారు కుటుంబాలుకు పథకం: ఏమి చెబుతున్నారు? ఈ పథకంలో ముఖ్యంగా డబ్బున్నవారు, కార్పొరేట్ సంస్థలు, NRIలు వంటి వారు ఒకో పేద కుటుంబాన్ని దత్తత. తీసుకోవాలి అని చెప్పారు. దీని ప్రకారం వారు: 1:ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలి 2: ఆరోగ్యం, విద్యలో సహాయపడాలి 3: జీవనోపాధి కల్పించాల...