జగన్‌కు వచ్చే అభిమానాన్ని పోలీసులతో అడ్డుకుంటావా? ప్రజాస్వామ్యంపై కేసుల పాలన
జగన్‌మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనను అడ్డుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యానికి నేరుగా సవాల్ విసిరినట్లుగా ఉన్నాయి. “112 మందికంటే ఎక్కువ మంది వస్తే ఒక్కొక్కరిపై ఐదు కేసులు పెడతాం” అనే హెచ్చరిక ఏ రాజకీయ పక్షానికైనా శోచనీయమైన దురదృష్టం.

ఇది నేరుగా ప్రజల హక్కుల మీద దాడి. ఒక నాయకుడిని కలవాలనే ఆసక్తితో వస్తున్న లక్షల మంది అభిమానులను కేసుల బెదిరింపులతో భయపెట్టాలనుకోవడం ఏ విధమైన పాలనకు సంకేతం? చంద్రబాబు
ప్రజలు గెలిపించారా? లేక…ఈవీఎం ట్యాంపరింగ్ తో గెలిచారా
చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి నిర్ణయం కూడా ప్రజల నుండి దూరంగా, పోలీస్ వ్యవస్థ ఆధారంగా, నడుస్తుంది. అసలు ప్రజలు నిజంగా నిన్ను గెలిపించారా అన్న అనుమానం ఇదే తీరు వల్ల ఏర్పడుతోంది. ఎందుకంటే ఓట్లతో గెలిచిన నాయకుడికి ప్రజలతో సంబంధం ఉండాలి, కానీ మీ తీరు చూస్తే, ప్రజలను వద్దనుకునే ప్రయత్నమే కనబడుతోంది.
జగన్ అంటే ఒక్క నాయకుడే కాదు – జగన్ అంటే ప్రజల్లో ఒక నమ్మకం – ఒక ప్రజా సునామీ
వైఎస్ జగన్ గారు ఒక సామాన్య నాయకుడు కాదు. ఆయన పేరు వినగానే వేలాది మంది జనాలు పరిగెడతారు. ఎందుకంటే ఆయనపై ఉన్న నమ్మకం, ప్రేమ, అభిమానాన్ని కేసులు పెట్టి ఆపలేరు. ప్రజల శక్తిని గుర్తించకుండా, వారిపై వత్తిడి తేవడమూ, కేసుల వేయడమూ చివరికి అధికారాన్ని కోల్పోవడానికి కారణమవుతుంది చంద్రబాబు. జగన్ గారిని ఆదరించే వాళ్లు లక్షల్లో లేరు... కోట్లలో ఉన్నారు!
వైఎస్ జగన్ పర్యటనకు వేల మంది అభిమానులు వస్తారు. వాళ్లను నియంత్రించలేక, కేసులతో భయపెట్టే ప్రయత్నం చేయడం ఓ పరాజయ సూచిక. నిజంగా పాలకుడివి అయితే, ప్రజలను చూసి భయపడడం ఎందుకు? ఈ ప్రజలే నీ భవిష్యత్‌ను నిర్ణయిస్తారు రాసిపెట్టుకో చంద్రబాబు
చంద్రబాబును ప్రజలు ప్రశ్నించాలి… భయపడకూడదు!
ఇది సామాన్యుడి హక్కులపైన దాడి మాత్రమే కాదు – ఇది ప్రజాస్వామ్యంపై దాడి. అలాంటి చర్యల్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మనందరిదీ. జగన్ గారిని కలవాలన్న ప్రజల హక్కును అడ్డుకోవడం అంటే, ప్రజల మనసు గుర్తించలేని పాలన కొనసాగుతోందన్న స్పష్టమైన సంకేతం.
జగన్‌ను కలవడానికి వచ్చే జనసంద్రాన్ని చూసి భయపడకండి. చంద్రబాబు గారు…మీలో దమ్ముంటే ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వండి.
కేసులకు భయపడే అభిమానం కాదు, ప్రజా గుండె చప్పుడుగా గుర్తించండి.
JAGAN Tv1 team. విశ్లేషణ నచ్చినట్లయితే షేర్ చేయండి
కామెంట్‌లు