రాహుల్‌కి జగన్ ఎందుకు సపోర్ట్ చేయరు – పూర్వనేపథ్యం మీకే చెబుతోంది
ఇటీవల కొన్ని సోషల్ మీడియా వేదికల్లో "రాహుల్ గాంధీ ఈసీపై పోరాటం చేస్తుంటే, జగన్ ఎందుకు మద్దతు ఇవ్వరు?" అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. కానీ ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వాలంటే, 2009 నుంచి ఇప్పటివరకు జరిగిన రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకోవాలి.

YS రాజశేఖర్ రెడ్డి గారి మరణం తరువాత జరిగిన గేమ్
2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తరువాత, చంద్రబాబు గేమ్ స్టార్ట్ చేశారు, కాంగ్రెస్ అగ్రనేతలతో టచ్‌లోకి వెళ్లిపోయారని, ఒక కీలక కాంగ్రెస్ నేత స్వయంగా చెప్పిన విషయాన్ని గతంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ప్రస్తావించారు.

చంద్రబాబు – రాహుల్ అండర్‌స్టాండింగ్
చంద్రబాబు రాహుల్ గాంధీ సూచనలతోనే రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, తరువాత సీఎం గా అయ్యాడు. అదే విధంగా, షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేయడం కూడా బహిరంగ రహస్యం.
ఈ కారణంగా షర్మిల, బీజేపీతో కలసి ఉన్న బాబు గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా, జగన్‌పై రోజూ దాడులు చేస్తుంటుంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అక్రమాలపై రాహుల్ మౌనం
రాహుల్ గాంధీ కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల అక్రమాల గురించి బహిరంగంగా మాట్లాడినా… ఏపీలో జరిగిన EVM టాంపరింగ్ గురించి ఒక్క మాట కూడా అనలేదు. ఇది బాబు – రాహుల్ మధ్య ఉన్న అండర్ స్టాండింగ్‌కు నిదర్శనం.
ఏపీలో పోలింగ్ డేటా అనుమానాలు
రాత్రి 8 గంటలకు తొలి పోలింగ్ శాతం ప్రకటించిన ఈసీ, తుది శాతం చెప్పడానికి 4 రోజులు ఆలస్యం చేసింది. మొదటి శాతం, తుది శాతం మధ్య 12.54% పెరుగుదల కనిపించింది. ఏకంగా 49 లక్షల ఓట్లు అదనంగా పెరిగాయి. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో సగటున 1.96 లక్షల ఓట్లు పెరిగాయి.
(ఈ డేటా Vote for Democracy సంస్థ వెల్లడించింది.)
కాంగ్రెస్ చేసిన అన్యాయం – జగన్ గారికి జైలు
YS రాజశేఖర్ రెడ్డి గారి మరణం తరువాత, జగన్ పార్టీ పెట్టకుండా ఆపేందుకు, ఆయన ఓటు బ్యాంకు తుడిచేయడానికి, కాంగ్రెస్ – టీడీపీ కలసి పనిచేశాయి. టిడిపి నేత ఎర్రం నాయుడు, కాంగ్రెస్ MLA శంకర్ రావు చేత కోర్టు కేసులు వేయించి, జగన్‌ను 16 నెలలు జైల్లో పెట్టించింది.ఇదంతా సోనియా – రాహుల్ పర్యవేక్షణలోనే జరిగింది. 2004, 2009లో కాంగ్రెస్ సెంటర్‌లో అధికారం లోకి రావడంలో, ఏపీలో వైఎస్ తీసుకొచ్చిన 30కి పైగా MP సీట్లు కీలక పాత్ర పోషించాయని, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా అన్న విషయం మరవకూడదు.
నేటి పరిస్థితి: ఇప్పటికీ కాంగ్రెస్ పుణ్యమే జగన్‌పై అక్రమ కేసులు కొనసాగుతున్నాయి. అదే కాంగ్రెస్ నేతలు, రాబర్ట్ వాద్రా మీద ED కేసులు వస్తే "ఇది అన్యాయం" అని అరుస్తారు.
ఇక బీజేపీ – బాబు కాంబినేషన్ ఒకవైపు, కాంగ్రెస్ – బాబు అండర్‌స్టాండింగ్ మరోవైపు ఉండగా, జగన్ రాహుల్‌కు మద్దతు ఇవ్వకపోవడం సహజమే కదా?
చివరగా…
"ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో,
ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం!"
JAGAN Tv1 విశ్లేషణ నచ్చినట్లయితే షేర్ చేయండి
కామెంట్‌లు